Tuesday, October 18, 2011

రెండు


ఒక సాయంత్రం నుండి
మరో సాయంత్రానికి చేరుకోవాలంటే
రెండు తలుపులు తెరవాలి!
ఒకటి ఉదయం
మరొకటి మధ్యాహ్నం
జీవితాన్ని గెలవాలంటే
రెండు తెరలు తొలగించాలి!
ఒకటి స్వార్థం
మరొకటి అసూయ!

2 comments:

  1. స్వార్థం, అసూయలను తొలగించుకున్న మనిషి మనీషి అవుతాడు. అప్పుడు జీవితాన్నే కాదు, ఈ లోకాన్నీ, పరలోకాన్నీ జయించగలడు... పెద్ద భావాన్ని చిన్న కవితలో ఇమిడ్చి చెప్పినందుకు అభినందనలు సౌమ్యమిత్ర గారూ....

    ReplyDelete
  2. ధన్యవాదాలు సర్.

    ReplyDelete