Friday, December 30, 2011

పుట్టిన రోజంటే 
మనిషి ఆయువులో 
ఒక సంవత్సర కాలం
తరిగిపోవడమే!
పెళ్లి రోజంటే
మనిషి తన ఉనికిని 
తాను కోల్పోవడమే!

Friday, December 16, 2011

వర్షం కురవకుండానే 
మేఘం వెళ్ళిపోతుందేమోనని...
స్వప్నంలోకి  నువ్వు రాకుండానే 
నిద్ర చేదిరిపోతుందేమోనని....
ఆశ కు అర్థం తెలియకుండానే 
ఆశయం నడిచి  పోతుందేమోనని... 
నువ్వనే మాట నన్ను చేరకుండానే 
జీవితం నన్ను విడిచిపోతుందేమోనని.... 

Wednesday, December 14, 2011

జీవితం సాగిపోదు!


ప్రతి అగ్ని
చల్లారుతుంది
ప్రతి తుఫాను
ప్రశాంతమవుతుంది
ప్రతి సమస్య
సమసిపోతుంది..
రోజులు గడిచే కొద్దీ
జీవితం మారిపోతూనే ఉంటుంది
ఒక జీవి పోయినా
జీవన క్రమం ఆగిపోదు
జ్ఞాపకం ఎంత కొత్తదైనా
పాత పడకపోదు
ఆప్తులు
అల్లంత దూరం లోకి
మారక పోరు!
ప్రతి మనిషి తత్వం
ఎదుటి మనిషికి
అర్థం కాకుండా
జీవితం సాగిపోదు!

Tuesday, December 13, 2011


ఎంత బలమయిన కోటయినా
ఒక్క భూకంపం చాలు
కూల్చడానికి..
ఎంతటి మేధావి అయినా
ఒక్క అక్షరం చాలు
ఆలోచింపచేయడానికి

జీవిత గ్రంధం


జీవిత గ్రంధం
మొదటి పుటల్లో
కనిపించేది మురిపాలు!
చివరిపేజీలో
మిగిలేవి జ్ఞాపకాలు!

నేనో శిశిరంలా !


ఒకప్పుడు
ఉప్పొంగే కెరటాలతో
ఉవ్విళ్ళూరే ఆరాటంతో ]
ప్రేమ పట్ల అనురక్తితో
నేనో వసంతంలా!
ఇప్పుడు
అనుభవంతో పండిపోయి
ఆవేదనతో ఎండిపోయి
అనుభూతి ఆకుల్ని
రాల్చేసుకుంటూ
నేనో శిశిరంలా !

సముద్రమంత ఏడుస్తున్నాను!


నీ చల్లని మనస్సును
చంద్రునితో పోల్చుతుంటే
కించిత్ గర్వపడ్డాను!
నీ మానవత్వాన్ని
దైవత్వంతో కొలుస్తుంటే
మరింత ఆనందించాను !
కాని...చంద్రునిలా..
అందనంత దూరంలో ఉంటావని
దైవంలా మౌనంగా ఉంటావని
తెలుసుకున్నప్పుడు మాత్రం
నా నీడతో ఎందుకు పోల్చుకోలేదా అని
సముద్రమంత ఏడుస్తున్నాను!

నువ్వే-నువ్వే!


కలసి రాలేదని
కాలాన్ని నిందించకు!
విధి విపరీతమని
విధులు మానుకోకు!
తలరాత రాసుకున్నా
తలరాత మార్చుకున్నా
భాధ్యుడవు నువ్వే!
బ్రహ్మవు నువ్వే!

గుండె గాయమయితే


గుండె గానమయితే
కోటి వన్నెల జలపాతాలు!
గుండె గాయమయితే
వేల వేల విషాదాల
కన్నీటి సముద్రాలు!!

జీతం -జీవితం


జీతం
ఖర్చయితే
మరో నెలలో వస్తుంది
జీవితం
ఖర్చయితే
మరో జన్మ ఉందా?

నీవు తలచుకుంటే


నీవు తలచుకుంటే
నీ జ్ఞాపకాన్ని నేను!
నీవు మలచుకుంటే
నీ రూపాన్ని నేను!
నీవు రాసుకుంటే
నీ భావాన్ని నేను!
నీవు ఇమ్మంటే
నీ ప్రాణాన్ని నేను!
నీవు పొమ్మంటే
నీ ఉనికి దృశ్యాన్ని నేను!