Sunday, January 22, 2012

ఆశ ముడిచిన పొట్లమై 
బతుకు అంచుల నిలవగా 
చదువు రేకుల చందమై 
నడిచివచ్చే అమ్మగా 
మంచు మెట్ల పైన నుండి
ఈ జాడ కదిలేనో కదా 
అది నీడలేని బాట అయింది..
సరస్వతి నిలయమైంది..

Saturday, January 14, 2012

'కొక్కోరోక్కో' 
పల్లె తల్లిని 
నిద్రలేపుతుంది 
'కోట్ల' కోసం  
పట్నవాసం  
నిద్ర మరచిపోతుంది 

Friday, January 13, 2012


ఒక నారి 
గుండె చెక్కలయి
అమ్మ అయింది 
కన్న బిడ్డ కోసం!
ఒక బండ రాయి
ముక్కలయి
దేవుని  బొమ్మయింది 
ప్రజల ముక్తి కోసం!

Tuesday, January 10, 2012

అందమయినవేవీ 
అధికంగా ఉండవు 
అది చందమామయినా 
సూర్య బింబమయినా...