Wednesday, November 30, 2011

అంకితం


చీకటి కమ్మక ముందే పువ్వులు కోసుకుని
వలపు తలపులతో వాటినల్లుకుంటూ
నులివెచ్చని నీటి స్పర్శలా నీ జ్ఞాపకాలు
నన్ను సున్నితంగా తాకుతున్నా
ఈ ప్రపంచంలో ప్రతీదీ వట్టి ఉహే అని తెలుసుకుని
కాసేపు నాలో నేనే నవ్వుకుంటూ
నువ్వెంతగా కాదన్నా నిన్నే తలుచుకుంటూ
నా రెప్పపాటి జీవితం నీకే అంకితం చేస్తున్నా!

Monday, November 21, 2011

నేనున్నదే నీకోసమే కదరా నాన్నా !


నవమాసాలు మోసి
కన్న నా ప్రాణాన్ని
ప్రకృతి ఎత్తుకుపోతుందా?
ప్రతి విపత్తుకు
సమాధానం
నా బిడ్డే అంటుందా?
నన్ను విడిచి వెళ్ళకురా కన్నా!
నేనున్నదే నీకోసమే కదరా నాన్నా !

Thursday, November 17, 2011

అలక


మగువను తాకిన
సుకుమారపు గాలి
అతీంద్రియ
వింజామరలయిందని
ప్రకృతి పరవశంతో ఉన్నా
లేత గులాబీల్లాంటి పాదాల్ని తాకుతూ
సిగ్గిల్లిన సొగసుల్ని
నేల సొంతం చేసుకుంది కదాని
కించిత్ అసూయ పడుతోంది
కాని...!
ప్రకృతికేమి తెలుసని?
అలకను మించిన
అరుణిమ అబల లో లేదని..

Thursday, November 3, 2011


చిలక
చిరాకు పడినా
అమితానందమే!
తన పుట్టింట్లో
ఉన్నంతవరకు!